Tuesday 20 November 2012

నా పరిచయం

 
నమస్కారమండీ! నా పేరు ప్రియ. సాదా సీదా తెలుగమ్మాయిని. అందరూ ఉన్నా పరిస్థితుల కారణాల చేత ఒంటరిగా... జీవితం, కుటుంబం, సంఘం నేర్పిన పాఠాల తాలుకు అనుభవాలతో ఈ జీవిత రైలులో ప్రయాణిస్తున్నాను. ఈ యిరవయ్యేళ్ళ జీవితం..... ఆశ్చర్యం, గుండెను పిండే బాధ, ఆకాశంలో విహరించినంత ఆనందం, పులకరింతా లాటి అన్ని రకాల భావాలతో మధురంగా  గడిచింది.  దేవుని సృష్టిలోనున్న ఎన్నెన్నో అద్భుతాలు చూసి అబ్బురపడుతూ ఆనందించే నా మనసులో వేవేల ఊహలు. నాకు ఎంతో మంది స్నేహితులున్నారు. కాని నా ప్రాణ స్నేహితుడు దేవుడు. ఆయననే నేను ప్రేమా అని పిలుచుకుంటాను. ఆ ప్రేమతో నా స్నేహం, మదిలో మెదిలే మాటలూ మీతో పంచుకోవాలనే ఈ చిన్ని ప్రయత్నం :)